ప్రేమకథ ముగిసింది

Anand Deverakonda movie updates - Sakshi

ఓ అందమైన ప్రేమకథ ముగిసిపోయింది. మరి.. ఎప్పుడు చూడొచ్చు అంటే త్వరలో విడుదల అంటున్నారు. టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా కేవీఆర్‌. మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దొరసాని’. రాజశేఖర్, జీవితల చిన్నకుమార్తె శివాత్మిక ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.

ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్‌ రంగినేని నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా.. ముఖ్యంగా తెలంగాణ భాష సంస్కృతులను ప్రతిబింబించేలా సినిమాను తెరకెక్కించారట మహేంద్ర. ఈ సినిమాకు ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top