రీమేక్‌ మీద మనసుపడ్డ అల్లువారబ్బాయి | Allu Sirish To Remake Dulquer Salmaan Film ABCD | Sakshi
Sakshi News home page

Apr 24 2018 11:15 AM | Updated on Apr 24 2018 11:55 AM

Allu Sirish To Remake Dulquer Salmaan Film ABCD - Sakshi

మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్‌ ఇమేజ్‌ అందుకోవడం కోసం తంటాలు పడుతున్న యువ కథానాయకుడు అల్లు శిరీష్‌. శ్రీరస్తు శుభమస్తు లాంటి హిట్ సినిమా వచ్చినా అది శిరీష్‌ కెరీర్‌కు పెద్దగా ప‍్లస్‌ అవ్వలేదు. ఇటీవల ఒక్క క్షణం అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్‌ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్‌ సాధించలేకపోయాడు. దీంతో శిరీష్ తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు.

శిరీష్‌.. రిస్క్‌ తీసుకోకుండా రీమేక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన ‘ఏబీసీడీ (అమెరికన్ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ)’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నాడు. 2013లో రిలీజ్‌ అయిన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయం సాధించటంతో పాటు దుల్కర్‌కు మంచి పేరు తీసుకువచ్చింది.  ఈ సినిమాను మధురా శ్రీధర్‌ నిర్మాణంలో సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించనున్నారు. మరి ఈ రీమేక్‌ అయిన శిరీష్‌కు స్టార్‌ ఇమేజ్‌ తీసుకువస్తుందేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement