ఆలియాభట్.. జీనియస్ ఆఫ్ ద ఇయర్!! | Alia Bhatt mocks her lack of GK in new video | Sakshi
Sakshi News home page

ఆలియాభట్.. జీనియస్ ఆఫ్ ద ఇయర్!!

Aug 25 2014 4:22 PM | Updated on Sep 2 2017 12:26 PM

ఆలియాభట్.. జీనియస్ ఆఫ్ ద ఇయర్!!

ఆలియాభట్.. జీనియస్ ఆఫ్ ద ఇయర్!!

ఆలియా భట్ హిందీ సినిమాల్లో అద్భుతంగా నటిస్తుంది. కానీ, జనరల్ నాలెడ్జి విషయంలో మాత్రం అమ్మడు చాలా పూర్.

ఆలియా భట్ హిందీ సినిమాల్లో అద్భుతంగా నటిస్తుంది. ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినా.. దాదాపు అన్నీ సూపర్ హిట్లే. కానీ, జనరల్ నాలెడ్జి విషయంలో మాత్రం అమ్మడు చాలా పూర్. ఆ విషయం మీద సోషల్ మీడియాలో ఆమెపై జోకులు తెగ పేలుతుంటాయి. తాజాగా ఆమె తన అజ్ఞానాన్ని మరోసారి నిరూపించుకుంది. కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోతో మొదటిసారి ఆమె అజ్ఞానం బయటపడింది. భారత రాష్ట్రపతి ఎవరంటే, పృథ్వీరాజ్ చవాన్ అని ఆమె చెప్పింది.

తాజాగా షకున్ బత్రా రూపొందించిన కామెడీ వీడియోలో.. ఆలియా ఓ మెంటల్ ట్రైనింగ్ జిమ్లో చేరినట్లు ఉంటుంది. ఆ ట్రైనింగ్ ద్వారా ఆమె తన జనరల్ నాలెడ్జిని పెంచుకోడానికి ప్రయత్నిస్తుంది. పది నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో ఆలియా తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్, తల్లి సోనీ రాజ్దాన్, 2స్టేట్స్ హీరో అర్జున్ కపూర్, హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా ఉంటారు. కరణ్ జోహార్ అడిగే అన్ని ప్రశ్నలకు పిచ్చి సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆలియాభట్ ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. తన మీద సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వస్తున్న జోకులన్నింటినీ తాను ఆస్వాదిస్తానని గతంలో ఓసారి ఆలియా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement