రాత్రంతా నిద్ర పోకుండా ఏంచేస్తారు? | Alia Bhatt and Shahid Kapoor planning a secret meeting? | Sakshi
Sakshi News home page

రాత్రంతా నిద్ర పోకుండా ఏంచేస్తారు?

Oct 5 2015 11:47 PM | Updated on Sep 3 2017 10:29 AM

రాత్రంతా నిద్ర పోకుండా ఏంచేస్తారు?

రాత్రంతా నిద్ర పోకుండా ఏంచేస్తారు?

పట్టు పరుపు మీద పవళిస్తే.. ఎవరికైనా నిద్ర ఇట్టే ముంచుకొచ్చేస్తుంది. కానీ, కొంతమంది పట్టు పాన్పులపై పడుకున్నా కూడా

 పట్టు పరుపు మీద పవళిస్తే.. ఎవరికైనా నిద్ర ఇట్టే ముంచుకొచ్చేస్తుంది. కానీ, కొంతమంది పట్టు పాన్పులపై పడుకున్నా కూడా నిద్రా దేవి కరుణించదు. షాహిద్ కపూర్, ఆలియా భట్ ఈ బాపతుకి చెందినవాళ్లే. పాపం.. ఇద్దరికీ నిద్రపట్టదు. కాకపోతే రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. ఇలా నిద్రలేమిని ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. అలాంటి వ్యాధితో బాధపడేవాళ్లుగా ‘షాన్‌దార్’లో షాహిద్, ఆలియా నటించారు. ఈ ఇద్దరూ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది. ‘క్వీన్’ ఫేం వికాస్ బెహల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

 1958లో వచ్చిన ‘పోస్ట్‌బాక్స్ నం 999’ చిత్రంలోని పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారట. దీని గురించి వికాస్ బెహల్ మాట్లాడుతూ -‘‘నిజజీవితంలో ఎంతోమంది ఇన్‌సోమ్నియా వ్యాధితో బాధపడుతుంటారు. వాళ్లకు ఈ సినిమాలోని షాహిద్, ఆలియా పాత్రలు బాగా కనెక్ట్ అవుతాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement