రియలిస్టిక్‌ లవ్‌ స్టోరీ | Ajay Bhupathi Speech At RX 100 Movie | Sakshi
Sakshi News home page

రియలిస్టిక్‌ లవ్‌ స్టోరీ

Jun 9 2018 12:33 AM | Updated on Jun 9 2018 12:33 AM

Ajay Bhupathi Speech At RX 100 Movie - Sakshi

కార్తికేయ, పాయల్‌ రాజపుత్‌

కార్తికేయ, పాయల్‌ రాజపుత్‌ జంటగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా జూలై 5న రిలీజ్‌ కానుంది. అజయ్‌ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది రియలిస్టిక్‌ లవ్‌ స్టోరీ మూవీ. ఓ చిన్న టౌన్‌ నేపథ్యంలో కథ నడుస్తుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ బైక్‌ సౌండ్‌లోనే తెలియని పొగరు ఉంటుంది. మా హీరో శివ పాత్ర అలాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్‌కి యూట్యూబ్‌లో 6  లక్షల ఆర్గానిక్‌ వ్యూస్‌ వచ్చాయి. ఓ చిన్న చిత్రం టీజర్‌కి ఇన్ని వ్యూస్‌ రావడం గ్రేట్‌. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి బిజినెస్‌ వర్గాల్లో క్రేజ్‌ పెరిగింది. ప్రస్తుతం రీ–రికార్డింగ్‌ జరుగుతోంది’’ అన్నారు అశోక్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement