‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’లా... | 'A film by Aravind' ... | Sakshi
Sakshi News home page

‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’లా...

May 4 2017 11:11 PM | Updated on Sep 5 2017 10:24 AM

‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’లా...

‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’లా...

రిషి, సోనియామాన్‌ జంటగా శ్రీ వెంకటేశ్వర సూపర్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఆకుల వెంకటేష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘డాక్టర్‌ చక్రవర్తి’

రిషి, సోనియామాన్‌ జంటగా శ్రీ వెంకటేశ్వర సూపర్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఆకుల వెంకటేష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘డాక్టర్‌ చక్రవర్తి’. శేఖర్‌ సూరి దర్శకుడు. విజయ్‌ కురాకుల సంగీత దర్శకుడు. ఈ చిత్రం మే ద్వితీయార్ధంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘శేఖర్‌ సూరి ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ని అద్యంతం ఉత్కంఠ కలిగేలా తీశారు. ఆ సినిమాలానే ఈ ‘డాక్టర్‌ చక్రవర్తి’ కూడా స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని అన్నారు. ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నిర్మాత వెంకటేష్‌ సహకారం మాటల్లో చెప్పలేనిది. విజయ్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు చిత్రదర్శకుడు శేఖర్‌ సూరి. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: తిరుపతిరెడ్డి, కెమెరా: రాజేందర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement