నాలుగు రోజుల్లోనే 30 లక్షల మంది చూశారా! | 3 Million views for ki and ka special song on Youtube | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లోనే 30 లక్షల మంది చూశారా!

Feb 26 2016 11:08 AM | Updated on Apr 3 2019 6:23 PM

నాలుగు రోజుల్లోనే 30 లక్షల మంది చూశారా! - Sakshi

నాలుగు రోజుల్లోనే 30 లక్షల మంది చూశారా!

బాలీవుడ్‌లో భిన్న కథాంశంతో తెరకెక్కుతున్న మూవీ 'కీ అండ్ కా'. మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వారం మొదట్లో ఓ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

బాలీవుడ్‌లో విభిన్న కథాంశంతో తెరకెక్కిన మూవీ 'కీ అండ్ కా'. మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వారం మొదట్లో ఓ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఆ సాంగ్ థీమ్‌ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన నాలుగు రోజుల్లోనే సంచలన రికార్డులు సృష్టించింది. కేవలం నాలుగు రోజుల్లోనే 30 లక్షల మంది యూట్యూబ్‌లో ఈ వీడియోను చూశారు. వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న 'కీ అండ్ కా' లో అర్జున్ కపూర్‌, కరీనా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. హౌస్ హస్బెండ్‌గా అర్జున్ కపూర్ కనిపించనుండగా, ఉద్యోగినిగా హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తోంది. ఆర్ బాల్కీ కథను అందించడంతో పాటు స్వయంగా ఆయనే దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

మూవీ ప్రమోషన్లో భాగంగా అర్జున్ కపూర్ ఆడవాళ్ల చెప్పులు వేసుకుని అదిరే స్టేప్పులు వేసి హంగామా చేశాడు. హై హీల్స్ చెప్పులు వేసుకుని కరీనాతో కలిసి అదిరే స్టెప్పులేసి మూవీకి మంచి హైప్ తీసుకొచ్చాడు. ఈ సాంగ్ ద్వారా మూవీ గురించి ప్రచారం చేస్తూ, ఆ మూవీలో మరిన్ని అంశాలు అలాగే ఉంటాయన్న ఆలోచనలు అభిమానుల అంచనాలను పెంచేస్తున్నాయి. హీరో ఆడవాళ్ల చెప్పులతో కనిపించే వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. రొటీన్ కు భిన్నంగా ఉండే స్టోరీ కావడంతో నేటి వరకు ఈ వీడియోను 30,71,312 యూట్యూబ్ లో వీక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement