ఎంత సక్కగున్నావే..!

Vultures Traveling 30 km per day for food - Sakshi

కనురెప్పలతోనే మాయ చేస్తున్న ఓ విహంగమా.. నీ కళ్లను చూస్తే ఏ మగువైనా కుళ్లుకోదా..! రెప్ప వాల్చకుండా నిన్నే చూడాలనేంత అందం తన సొంతం.. తల వెనుక చూశారా ఈకలతో కిరీటం ధరించిన రాణిలా ఎలా హొయలు పోతోందో.. ఈ అందమైన గువ్వ పేరు సెక్రటరీ బర్డ్‌. రాబందులు, గద్దల జాతికి చెందిన ఈ పక్షి ఎక్కువగా పాములను వేటాడి ఆహారంగా తీసుకుంటుందట. ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఇవి ఉంటాయట. తన ఆహారం కోసం రోజూ 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తుందట. చాలా వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు తరలి వెళుతుందట మన పక్షిరాజం. ఎంతైనా ఈ పక్షి కాస్త డేంజరసే సుమీ!  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top