ద.అమెరికా లో హింస, 78 మంది మృతి | violent protests in Venezuela’s , 78 died | Sakshi
Sakshi News home page

ద.అమెరికా లో హింస, 78 మంది మృతి

Jun 29 2017 4:21 PM | Updated on Aug 7 2018 4:29 PM

ద.అమెరికా లో హింస, 78 మంది మృతి - Sakshi

ద.అమెరికా లో హింస, 78 మంది మృతి

వెనిజువెలాలో చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య పెరుగుతోంది.

కారకాస్‌(వెనిజువెలా): దక్షిణ అమెరికా, వెనిజువెలాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జరిగిన గొడవల్లో మొత్తం మృతుల సంఖ్య 78కి చేరుకుందని అధికార యంత్రాంగం తెలిపింది. అధ్యక్షుడు నికొలస్‌ మడురో ప్రభుత్వం ప్రభుత్వంపై విసుగెత్తిన ప్రజలు, ప్రతిపక్షాలు ఆయన  గద్దెదిగాలని కోరుతూ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

మూడు నెలలు కొనసాగుతున్న అశాంతితో సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు ఇప్పటి వరకు 1500 మందిని పౌరులను అదుపులోకి తీసుకున్నారు. అధికారంలో మరింత కాలం కొనసాగేందుకు అధ్యక్షుడు మడురో అక్రమాలకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement