9 కోట్ల డాలర్లు చెల్లించండి: బ్రిటన్‌ కోర్టు | UK Court Awards BOC Aviation $90 Million In Claims Against Vijay Mallya | Sakshi
Sakshi News home page

9 కోట్ల డాలర్లు చెల్లించండి: బ్రిటన్‌ కోర్టు

Feb 13 2018 2:56 AM | Updated on Apr 6 2019 9:07 PM

UK Court Awards BOC Aviation $90 Million In Claims Against Vijay Mallya - Sakshi

విజయ్‌ మాల్యా

లండన్‌/సింగపూర్‌: భారత్‌లో బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు మరో సమస్య ఎదురైంది. కింగ్‌ ఫిషర్‌ కోసం విమానాలను అద్దెకు తీసుకున్నందుకుగానూ సింగపూర్‌కు చెందిన బీవోసీ ఏవియేషన్‌ సంస్థకు 9 కోట్ల అమెరికన్‌ డాలర్లు చెల్లించాల్సిందిగా యూకేలోని ఓ కోర్టు ఆదేశించింది. మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుకు సంబంధించి వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో తుది విచారణ వచ్చే నెల 16న ప్రారంభం కానుంది. మేలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement