యాహూలో ట్విటర్ విలీనం! | Twitter is integrated in Yahoo! | Sakshi
Sakshi News home page

యాహూలో ట్విటర్ విలీనం!

Jun 5 2016 1:47 AM | Updated on Sep 4 2017 1:40 AM

యాహూలో ట్విటర్ విలీనం!

యాహూలో ట్విటర్ విలీనం!

మైక్రో బ్లాగింగ్ వైబ్‌సైట్ ట్విటర్ యాహూలో విలీనం అయ్యే అవకాశముంది. ఈ మేరకు ట్విటర్ అధికారులు యాహూ సీఈవో మరిస్సా మేయర్‌తో విలీన అవకాశాలను చర్చించినట్లు సమాచారం.

న్యూయార్క్:  మైక్రో బ్లాగింగ్ వైబ్‌సైట్ ట్విటర్ యాహూలో విలీనం అయ్యే అవకాశముంది. ఈ మేరకు ట్విటర్ అధికారులు యాహూ సీఈవో మరిస్సా మేయర్‌తో విలీన అవకాశాలను చర్చించినట్లు సమాచారం. మేనేజ్‌మెంట్ సమావేశంలో ఇరు సంస్థల ప్రధాన అధికారులు విస్తృతంగా సమాలోచనలు జరిపినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. యాహూ-ట్విటర్ సమాచార మార్పిడి ద్వారా మార్కెట్లో పట్టు పెంచుకోవాలని చూస్తున్నాయి. త్వరలో బిడ్డింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే విలీన వ్యాఖ్యలపై కంపెనీ స్పందించజాలదని ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. టెలికం దిగ్గజం వెరిజోన్‌తో యాహూ కోర్ ఇంటర్‌నెట్ వ్యాపారం కోసం త్వరలో రెండో రౌండ్ వేలం జరగనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement