తీరాన్ని తాకిన తుపాను.. భయం గుప్పిట్లో ప్రజలు | Sakshi
Sakshi News home page

తీరాన్ని తాకిన తుపాను.. భయం గుప్పిట్లో ప్రజలు

Published Sat, Oct 21 2017 8:28 PM

Storm Brian Hits Britain With 70 Mph Winds, Forced to Shut Roads

లండన్‌ : బ్రియాన్‌ తుపాను బ్రిటన్‌ తీరాన్ని తాకింది. తుపాను తీరం దాటుతున్న సమయంలో 70 మైళ్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో అధికారులు రోడ్లను మూసేశారు. బ్రిటన్‌ వాతావరణ శాఖ ఎల్లో వెదర్‌ వార్నింగ్‌ను జారీ చేసింది. ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

పలు ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం అర్థరాత్రి(బ్రిటన్‌ కాలమానం ప్రకారం) వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హరికేన్‌ ఓఫిలియా ధాటి నుంచి కోలుకోకముందే బ్రియాన్‌ విరుచుకుపడటంతో ఐర్లాండ్‌, బ్రిటన్‌ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

Advertisement
Advertisement