నత్తల పరుగు పందెం! | Snails ‘slug’ it out in championship race | Sakshi
Sakshi News home page

నత్తల పరుగు పందెం!

Jul 19 2016 12:24 PM | Updated on Aug 20 2018 7:27 PM

యూకే లో జరిగిన నత్తల ప్రపంచ చాంపియన్ షిప్ లో హెర్బీ అనే నత్త కొత్త చాంపియన్ గా అవతరించింది.

200లకు పైగా నత్తలు ఈ ఏడాది కాన్గ్ హామ్, యూకే లో జరిగిన ప్రపంచ నత్తల చాంపియన్ షిప్ లో పాల్గొన్నాయి. 13 ఇంచ్ ల దూరాన్ని దాదాపు 3 నిమిషాల 25 సెకండ్లలో పూర్తి చేసిన హెర్బీ అనే నత్త ఈ ఏడాది చాంపియన్ గా అవతరించింది. గత 25 ఏళ్లగా నత్తల చాంపియన్ షిప్ కు కాన్గ్ హామ్ వేదికగా నిలుస్తోంది.

అంతేకాకుండా మేలు జాతి నత్తలకు కాన్గ్ హామ్ పేరుగాంచింది. కాగా, 2 నిమిషాల్లోనే రేసును పూర్తి చేసిన ఘనత 9 ఏళ్ల వయసు కలిగిన థామస్ విన్సెంట్ అనే నత్త పేరిట ఉంది. నత్తల పోటీల్లో పాల్గొంటున్నవారిలో ఎక్కువమంది పిల్లలే ఉంటున్నారు. నత్తలను పెంచుతూ.. ట్రైనింగ్ ఇస్తూ ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement