అమెరికాలో సిక్కు డ్రైవర్‌ మృతి | Sikh truck driver dies two weeks after being shot in Ohio | Sakshi
Sakshi News home page

అమెరికాలో సిక్కు డ్రైవర్‌ మృతి

May 28 2018 5:14 AM | Updated on Apr 4 2019 3:25 PM

Sikh truck driver dies two weeks after being shot in Ohio - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ సిక్కు ట్రక్‌ డ్రైవర్‌ మరణించాడు. ఈ నెల 12న ఒహయోలో జస్‌ప్రీత్‌ సింగ్‌(32) అనే ట్రక్కు డ్రైవర్‌పై బ్రోడరిక్‌ మలిక్‌ జోన్స్‌ రాబర్ట్స్‌(20) కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన జస్‌ప్రీత్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21న కన్నుమూశాడు.  జస్‌ప్రీత్‌ ట్రక్‌లో ఉండగా దోపిడీకి ప్రయత్నించిన రాబర్ట్స్‌.. అతను ప్రతిఘటించడంతో కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement