రికార్డులను కడిగేసిన ముత్యం... | Pearl dishwashers records ... | Sakshi
Sakshi News home page

రికార్డులను కడిగేసిన ముత్యం...

May 3 2014 4:54 AM | Updated on Sep 2 2017 6:50 AM

రికార్డులను కడిగేసిన ముత్యం...

రికార్డులను కడిగేసిన ముత్యం...

ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ముత్యం. కృత్రిమమైనది కాదు.. సహజసిద్ధమైనది. 33.15 క్యారెట్ల ఈ ముత్యం వ్యాసం 0.7 అంగుళాలు.

 ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ముత్యం. కృత్రిమమైనది కాదు.. సహజసిద్ధమైనది. 33.15 క్యారెట్ల ఈ ముత్యం వ్యాసం 0.7 అంగుళాలు. దీన్ని గురువారం బ్రిటన్‌కు చెందిన వూలీ అండ్ వాలిస్ సంస్థ వేలం వేయగా.. ఏకంగా రూ.8.2 కోట్లకు అమ్ముడుపోయింది. ఇదో ప్రపంచ రికార్డట. దీనికి రూ.2.5 కోట్లు వస్తుందని వేలం సంస్థ అంచనా వేయగా.. దాన్ని మించిన ధర రావడం విశేషం. లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల సంస్థ డేవిడ్ మోరిస్ ఈ ముత్యాన్ని కొనుగోలు చేసింది. హాంకాంగ్‌కు చెందిన ఓ కోటీశ్వరుడి కోసం తయారుచేస్తున్న నెక్లెస్‌లో దీన్ని అమరుస్తారట.
 
 

Advertisement
 
Advertisement
Advertisement