అధ్యక్షుడిని చంపితే రూ. ఏడు కోట్లిస్తాం | new Philippines president Duterte after he offered to reward anyone who killed a drug dealer | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడిని చంపితే రూ. ఏడు కోట్లిస్తాం

Jun 10 2016 2:43 AM | Updated on Jul 30 2018 8:29 PM

అధ్యక్షుడిని చంపితే రూ. ఏడు కోట్లిస్తాం - Sakshi

అధ్యక్షుడిని చంపితే రూ. ఏడు కోట్లిస్తాం

ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్‌ను హత్య చేస్తే సుమారు రూ. 7.25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఫిలిప్పీన్స్ డ్రగ్స్ మాఫియా ఆఫర్లు
మనీలా: ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్‌ను హత్య చేస్తే సుమారు రూ. 7.25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నేరస్తులు, డ్రగ్ డీలర్లపై యుద్ధం ప్రకటించడంతో డ్రగ్ మాఫియా ఈ రకమైన బెదిరింపులకు పాల్పడుతోంది. ఫిలిప్పీన్స్‌కు కొత్తగా ఎన్నికైన పోలీస్ చీఫ్ రొనాల్డ్ డెలా రోసా ఈ విషయం వెల్లడించారు. అధ్యక్షుడిని చంపితే మొదట్లో రూ.కోటిన్నర ఆఫర్ ప్రకటించింది.

అయితే ఈ పనికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచారట. తాను అధికార బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లో నేరా లు, డ్రగ్స్ మాఫియాను ఫిలిప్పీన్స్ నుంచి పరారయ్యేట్లు చేస్తానని డుటెర్ట్ ప్రకటిం చారు. డ్రగ్ డీలర్లను చంపిన వారికి నగదు బహుమతులు కూడా ఇస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement