న్యూయార్క్‌ అగ్నిప్రమాదంలో 12 మంది మృతి | A Boy's Scream, a Door Ajar and 12 Dead in a Bronx Fire | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌ అగ్నిప్రమాదంలో 12 మంది మృతి

Dec 30 2017 5:56 AM | Updated on Apr 4 2019 3:49 PM

A Boy's Scream, a Door Ajar and 12 Dead in a Bronx Fire - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భవనంలో చిక్కుకున్న 12 మందిని సహాయక బృందాలు రక్షించాయి. బ్రాంక్స్‌ ప్రాంతంలో ఉన్న ప్రాస్పెక్ట్‌ అవెన్యూ అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6.50 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.  దాదాపు 160 మంది అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గత పాతికేళ్లలో న్యూయార్క్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదమని నగర మేయర్‌ బిల్‌ డే బ్లాసియో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement