రోజూ కొంచెం మద్యం ఆరోగ్యానికి మంచిదే! | A little alcohol on a regular basis is good for health! | Sakshi
Sakshi News home page

రోజూ కొంచెం మద్యం ఆరోగ్యానికి మంచిదే!

Nov 25 2016 9:16 AM | Updated on Sep 4 2017 9:01 PM

రోజూ కొంచెం మద్యం ఆరోగ్యానికి మంచిదే!

రోజూ కొంచెం మద్యం ఆరోగ్యానికి మంచిదే!

ప్రతిరోజూ కొద్ది మొత్తంలో ఆల్కహాలు తీసుకుంటే గుండెపోటుతో పాటు అన్ని రకాల ప్రమాదాలు (స్టోక్స్)దరిదాపులకు రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

లండన్: ప్రతిరోజూ కొద్ది మొత్తంలో ఆల్కహాలు తీసుకుంటే గుండెపోటుతో పాటు అన్ని రకాల ప్రమాదాలు (స్టోక్స్)దరిదాపులకు రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు సుమారు 20 వేల మందిపై పరిశోధనలు జరిపి కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

రోజుకి మూడు యూనిట్ల ఆల్కహాలు తీసుకోవడం వల్ల ఇస్కామిక్ స్టోక్స్ (రక్తం గడ్డ కట్టడం వల్ల రక్త సరఫరా ఆగిపోవడం) రావడం తగ్గుతుందని తేల్చారు. ఈ పరిశోధనల్లో సుమారు 85 శాతం మందిలో సత్ఫలితాలను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. కానీ అధికంగా ఆల్కహాలు సేవిస్తే మాత్రం అన్ని రకాల స్టోక్స్ర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement