చార్మినార్ వద్ద చిన్నారి కిడ్నాప్...పోలీసుల వేట | Two years old baby kidnapped in charminar | Sakshi
Sakshi News home page

చార్మినార్ వద్ద చిన్నారి కిడ్నాప్...పోలీసుల వేట

Mar 11 2015 5:49 PM | Updated on Sep 2 2017 10:40 PM

పాతబస్తీ చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక బుధవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైంది.

హైదరాబాద్ : పాతబస్తీ చార్మినార్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక బుధవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైంది. హైకోర్టు ఆరో గేట్ సమీపంలో టీకొట్టు నడుపుకుంటున్న విష్ణు కుమార్తె మోనిక(2)ను  ఆగంతకుడు అపహరించుకుని పోయాడు. ఆ విషయాన్ని ఆలస్యంగా గమనించిన విష్ణు... పోలీసులను ఆశ్రయించాడు.

దాంతో పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజిలను పరిశీలించి... నిందితుడిని పోలీసులు గుర్తించారు. కిడ్నాపైన చిన్నారి మోనికను రక్షించేందుకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement