బోయిన్‌పల్లిలో లారీ బోల్తా.. ట్రాఫిక్ జామ్ | traffic jam due to lorry roll at bowenpally | Sakshi
Sakshi News home page

బోయిన్‌పల్లిలో లారీ బోల్తా.. ట్రాఫిక్ జామ్

May 4 2016 10:54 AM | Updated on Sep 3 2017 11:24 PM

నగరంలోని బోయిన్‌పల్లి వద్ద ఓ లారీ బుధవారం ఉదయం బోల్తా పడింది.

హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లి వద్ద ఓ లారీ బుధవారం ఉదయం బోల్తా పడింది. ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌కు మెటీరియల్ తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కాగా ఉదయం నుంచి ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచి పోయాయి. పోలీసులు క్రేన్‌తో లారీని అడ్డు తీయడానికి రెండు గంటలకు పైగా సమయం తీసుకోవడంతో అప్పటి వరకు ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement