రేపు లాయర్ల ‘ఛలో హైదరాబాద్’ | telangana lawyers JAC called chalo hyderabad | Sakshi
Sakshi News home page

రేపు లాయర్ల ‘ఛలో హైదరాబాద్’

Jun 30 2016 12:54 PM | Updated on Sep 4 2017 3:49 AM

తెలంగాణ లాయర్ల జేఏసీ శుక్రవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

హైదరాబాద్: తెలంగాణ లాయర్ల జేఏసీ శుక్రవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, జడ్జిలకు ఆప్షన్లు ఇవ్వటంపై గత కొన్ని రోజులుగా లాయర్లు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే 11 మంది జడ్జిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఆందోళన చేయాలని టీ అడ్వకేట్స్ జేఏసీ నిర్ణయించింది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద చేపట్టే ఆందోళనకు పెద్ద ఎత్తున హాజరు కావాలని లాయర్లను కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement