హిమాలయాలపై ‘టీ’ జెండా | Sakshi
Sakshi News home page

హిమాలయాలపై ‘టీ’ జెండా

Published Tue, Jun 2 2015 12:36 AM

హిమాలయాలపై ‘టీ’ జెండా

 సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ సభ్యులు హిమాలయాల్లో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో 1,600 మీటర్ల పర్వతాన్ని అధిరోహించారు. ఈనెల 7న యాత్ర ముగించుకుని హైదరాబాద్ వచ్చాక.. తాము ఎక్కిన పర్వతానికి ‘తెలంగాణ పర్వతం’ పేరు పెట్టాలని ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్‌ను కోరనున్నారు.

ఈ వివరాలను ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ సభ్యుడు, అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె.రంగా రావు ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. మే 18న ఏడుగురు సభ్యులతో హిమాలయాలకు వెళ్లిన బృందం 6,000 మీటర్ల ఎత్తున్న గోలేప్ కాంగ్రీ, 6,140 మీటర్ల స్టాక్ కాంగ్రీ పర్వతాలను అధిరోహించింది. ఇంకా 6,666 మీటర్ల లంగ్‌సర్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించాల్సి ఉంది.

Advertisement
Advertisement