హైదరాబాద్ను వణికిస్తున్న స్వైన్ఫ్లూ! | Swine Flu cases increasing in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ను వణికిస్తున్న స్వైన్ఫ్లూ!

Jan 20 2015 9:09 PM | Updated on Sep 2 2017 7:59 PM

హైదరాబాద్ను వణికిస్తున్న స్వైన్ఫ్లూ!

హైదరాబాద్ను వణికిస్తున్న స్వైన్ఫ్లూ!

స్వైన్ఫ్లూ హైదరాబాద్ను వణికిస్తోంది.

హైదరాబాద్ : స్వైన్ఫ్లూ హైదరాబాద్ను వణికిస్తోంది. ఈ వ్యాధితో ఈరోజు ఇక్కడ మరో ముగ్గురు మృతి చెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు, గాంధీ ఆస్పత్రిలో ఒకరు మృతి చెందారు. తాజాగా 50 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో పది మంది మృతి చెందారు. రోజురోజుకు ఈ వ్యాధి సోకినవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

  ఈ పరిస్థితులలో స్వైన్ఫ్లూను అరికట్టడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్నిమార్గదర్శకాలను విడుదల చేసింది. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డాక్టర్లని సంప్రదించాలని  కోరింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి స్వైన్ఫ్లూ వ్యాధికి లక్ష్యణాలుగా పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement