తెలంగాణ మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు | Ministers to change in telangana cabinet | Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు

Apr 22 2016 5:12 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు - Sakshi

తెలంగాణ మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు

తెలంగాణ మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో మరోసారి స్వల్ప మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో మరోసారి స్వల్ప మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్కు పరిశ్రమల శాఖ, జూపల్లి కృష్ణారావుకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ ఇప్పటికే పంచాయితీరాజ్, ఐటీతో పాటు మున్సిపల్ శాఖలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా రెండు, మూడు రోజుల్లో శాఖల మార్పులు జరిగే అవకాశం ఉంది.

 

ఇక గతంలోనూ మంత్రుల శాఖల్లో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరికి విద్యా శాఖ కేటాయించి, అప్పటి వరకు విద్యా శాఖ మంత్రిగా ఉన్న జగదీష్‌ రెడ్డికి విద్యుత్‌ శాఖను, మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement