జూబ్లీహిల్స్లో అర్థరాత్రి హిజ్రా హల్చల్ | Hijra arrested in Jubilee hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్లో అర్థరాత్రి హిజ్రా హల్చల్

Sep 6 2014 9:16 AM | Updated on Sep 26 2018 6:32 PM

జూబ్లీహిల్స్లో అర్థరాత్రి హిజ్రా హల్చల్ - Sakshi

జూబ్లీహిల్స్లో అర్థరాత్రి హిజ్రా హల్చల్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి ముంబైకి చెందిన సీమా అనే హిజ్రా హల్‌చల్‌ చేసింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45 పెద్దమ్మ గుడి ...

అది హైదరాబాద్‌లో సంపన్నులు ఉండే ప్రాంతం. అర్ధరాత్రి దాటినా రోజులాగే వాహనాలతో రద్దీగా ఉంది ఆ ప్రాంతం. అంతేకాదు.. వారాంతం కావటంతో మందుబాబుల హంగామా కూడా అంతా ఇంతా కాదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్‌ ఖాకీలు.... జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అంతే అక్కడ వున్న పోలీసులు.... మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. తీరా విషయం తెలుసుకుని షాక్‌ తిన్నారు. ఇంత హడావుడికి కారణం ముంబైకి చెందిన సీమా అనే ఓ హిజ్రా. లిప్ట్ అంటూ ఓ కారు ఎక్కింది.

కొద్దిదూరం వెళ్లాక... కారు నడుపుతున్న వ్యక్తి మెడలోని బంగారు గొలుసు తీసుకుని పారిపోబోయింది. అంతే... పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు... ఇదేమిటిరా అని తేరుకున్న కారు డ్రైవర్‌ అరవటం   మొదలుపెట్టాడు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు హిజ్రాను పట్టుకునే యత్నం చేశారు. అది చూసి... మీడియాపై రాళ్లు రువ్వే యత్నం  చేసింది. అంతేకాకుండా తాను దొంగను కాదు... కారు డ్రైవర్‌ బంగారు గొలుసు... బండిలోనే ఉందంటూ... దబాయించింది. చివరికి... పారిపోతున్న హిజ్రాను పట్టుకుని పోలీసులు తమ వాహనంలో లిప్ట్ ఇచ్చి స్టేషన్‌ను తీసుకెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement