24 ప్రాంతాల్లో గ్రేటర్ ఓట్ల లెక్కింపు | ghmc election counting at 24 centres in hyderabad | Sakshi
Sakshi News home page

24 ప్రాంతాల్లో గ్రేటర్ ఓట్ల లెక్కింపు

Feb 3 2016 6:53 PM | Updated on Sep 4 2018 5:07 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ గ్రేటర్ పరిధిలో 24 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ గ్రేటర్ పరిధిలో 24 ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుతుందని... కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు వెల్లడించారు.

శుక్రవారం ఉదయం 8 గంటలకు  ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. తొలిత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. పాతబస్తీలో రీ పోలింగ్కు అవకాశం లేదని... ప్రిసైడింగ్ అధికారి నివేదిక కూడా అదే విషయం చెబుతోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement