కన్నుల పండుగలా గణేష్ శోభాయాత్ర | ganesh nimajjanam in hyderabad | Sakshi
Sakshi News home page

కన్నుల పండుగలా గణేష్ శోభాయాత్ర

Sep 27 2015 3:44 PM | Updated on Sep 4 2018 5:16 PM

కన్నుల పండుగలా గణేష్ శోభాయాత్ర - Sakshi

కన్నుల పండుగలా గణేష్ శోభాయాత్ర

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జంట నగరాల్లో గణేశుని సామూహిక నిమజ్జన ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి. 

మహానగరం అంతా డప్పులు, డ్యాన్సులు, డీజేలతో సందడిగా మారింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి నగరంలో పటిష్ట పోలీసు బలగాలను ఉంచారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం అందించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement