జయప్రద కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైంజిగ్ | breath analyser test test for Jayaprasad car driver | Sakshi
Sakshi News home page

జయప్రద కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైంజిగ్

Jul 26 2015 9:17 AM | Updated on May 25 2018 2:06 PM

జయప్రద కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైంజిగ్ - Sakshi

జయప్రద కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైంజిగ్

జయప్రద కారు డ్రైవర్‌ను డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఫిలింనగర్ రోడ్‌నంబర్ 1లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ వద్ద శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 14 మందిపై కేసులు నమోదు చేశారు. ఎనిమిది ద్విచక్ర వాహనాలు, ఆరు కార్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసులు నమోదైన వారికి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

రాత్రి ఓ విందులో పాల్గొని సినీ నటి జయప్రద తన కారులో ఇంటికి బయల్దేరారు. ఆమె కారు డ్రైవర్‌ను డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించారు. అయితే డ్రైవర్ మద్యం సేవించలేదని నిర్ధారణ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement