భవ్యశ్రీ కథ సుఖాంతం! | Bhavyasri Mystery case Traced | Sakshi
Sakshi News home page

భవ్యశ్రీ కథ సుఖాంతం!

Oct 12 2014 7:00 PM | Updated on Sep 2 2017 2:44 PM

భవ్యశ్రీ

భవ్యశ్రీ

హైదరాబాద్లో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది.

హైదరాబాద్: హైదరాబాద్లో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆమె వైజాగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసు ప్రత్యేక బృందాలు భవ్యశ్రీని హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రిలీఫ్ కోసమే తాను విశాఖ వెళ్లినట్లు భవ్యశ్రీ చెప్పారు.

కూకట్పల్లిలో నివాసం ఉంటున్న భవ్యశ్రీ ఈ నెల 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఆమె క్యాబ్లో డ్యూటీకి బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత  ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తన భార్య కనిపించడంలేదంటూ భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు విశాఖలో ఉన్నట్లు తెలుసుకొని, అక్కడకు వెళ్లి ఆమెను ఇక్కడకు తీసుకువచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement