తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ | anurag sharma appointed as telangana DGP | Sakshi
Sakshi News home page

తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ

Nov 13 2015 3:37 PM | Updated on Sep 3 2017 12:26 PM

తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ

తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ

తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ నియమితులయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ నియమితులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. అనురాగ్ శర్మను డీజీపీగా నియమించాలని నిర్ణయించారు. 1982 బ్యాచ్‌కు చెందిన అనురాగ్ శర్మ...రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. హైదరాబాద్ సిటీ సౌత్ జోన్ డీసీపీగా, సీపీగా, వరంగల్ డీఐజీగా పనిచేశారు.  గ్రేహౌండ్స్ ఐజీ, అడిషనల్ జిల్లా డిజీగా, అలాగే 18 నెలలుగా ఇన్‌ఛార్జ్ డీజీపీగా పనిచేశారు.

తెలంగాణ డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ఇటీవల యూపీఎస్సీ రాష్ట్రానికి పంపింది. ఈ జాబితాలో సీనియర్ ఐపీఎస్ అధికారులు అరుణా బహుగుణ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ పేర్లు ఉన్నాయి. తెలంగాణ సర్కార్  అనురాగ్ శర్మ వైపే మొగ్గు చూపింది.

Advertisement
 
Advertisement
Advertisement