బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి | Trough of low pressure in bay of bengal | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

Nov 29 2015 8:17 AM | Updated on Sep 3 2017 1:13 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.

విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ద్రోణి ప్రాంతంలో 3.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. దక్షిణా కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. తమిళనాడులోనూ విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement