నడిరోడ్డుపై వృద్ధుడి ఆత్మహత్యాయత్నం | Man attempts suicide on Road | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

Dec 26 2015 4:32 PM | Updated on Oct 9 2018 5:39 PM

పట్టపగలు నడిరోడ్డుపై ఓ వృద్ధుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్ : పట్టపగలు నడిరోడ్డుపై ఓ వృద్ధుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని హబ్సిగూడలో శనివారం కలకలం రేపింది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి 108 సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement