శ్రీనివాసుడి కళ్యాణం... ఎవరితో?! | Srinivasa Kalyanam Serial | Sakshi
Sakshi News home page

శ్రీనివాసుడి కళ్యాణం... ఎవరితో?!

Feb 21 2016 12:19 AM | Updated on Sep 3 2017 6:03 PM

శ్రీనివాసుడి కళ్యాణం... ఎవరితో?!

శ్రీనివాసుడి కళ్యాణం... ఎవరితో?!

ఓ హీరో... ఇద్దరు హీరోయిన్లు... ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ఇలా చెబితే కొత్తేముందిలే అనిపించవచ్చు.

ఓ హీరో... ఇద్దరు హీరోయిన్లు... ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ఇలా చెబితే కొత్తేముందిలే అనిపించవచ్చు. కానీ ఆ ప్రేమ కొన్ని కుటుంబాలతో ముడిపడినదైతే? ఎమోషన్స్ చుట్టూ తిరిగేదయితే? బంధ నాలుగా మారిన బంధాలను వదిలించుకోలేక అల్లాడేదయితే? అనుబంధాలను నిలుపుకోవడం కోసం త్యాగాలు చేసేది అయితే? అది గొప్ప ప్రేమ. అలాంటి ప్రేమే శ్రీనివాస్‌ది. అంటే ‘శ్రీనివాస కళ్యాణం’ సీరియల్ హీరోది. తన తల్లిదండ్రుల ప్రేమ పెళ్లి వల్ల విడిపోయిన కుటుంబాల్ని కలపడానికి నడుం కడతాడు శ్రీనివాస్.

ఆ క్రమంలో ఓ మేనమామ కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అంతలో మరో మేనమామ కూతురు మంగ... శ్రీనివాస్ మీద ప్రేమ పెంచుకుంటుంది. శ్రీనివాస్ ఎవరో తెలిసి మేన మామలు తమ కూతుళ్లకి వేరే సంబంధాలు చూస్తారు. మంగ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెను కాపాడటం కోసం ప్రేమించినట్టు నటించమంటుంది పద్మ. తప్పక అంగీకరిస్తాడు శ్రీనివాస్. అటు ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేడు. ఇటు తనను ప్రేమిస్తున్న అమ్మాయిని అంగీకరించలేదు. ఈ సస్సెన్సే సీరియల్‌ని సక్సెస్ బాట పట్టించింది. చూడాలి మరి... శ్రీనివాసుడి కళ్యాణం ఎవరితో జరుగుతుందో!

Advertisement
 
Advertisement
Advertisement