శ్రీకృష్ణార్జున విజయం చిత్రంలో... ద్రోణాచార్యుడి మీద ప్రతీకారాగ్నితో రగిలిపోతున్న ద్రుపదుడు, నది దాటడానికి వచ్చి, అక్కడ ఉన్న బాలుడిని నది దాటించమని అడుగుతాడు. నది ప్రమాదస్థాయిలో ఉందని, సుడిగుండాలు ఉన్నాయని, ఆ వేళలో నది దాటడం మంచిదికాదని ఆ బాలుడు చెప్పినా వినకుండా, తానే తెప్పలో నది దాటుతానని చెప్పి, తెప్ప నడపడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు బాలుడి వేషంలో వచ్చి వేదాంతబోధ చేస్తూ పాడే పాట ‘నడిచేది జీవుడు నడిపేది దేవుడు’.గూఢార్థం ఉండే పాటలకు నేను అంతకుముందు ఎన్నడూ ట్యూన్ చేయలేదు. ఈ పాటతో నా కోరిక నెరవేరడమే కాదు, ఈ చిత్రానికి నాకు నంది అవార్డు కూడా అందింది.
ఈ పాట విన్నప్పుడు నేను ఎక్కడో చదివిన ఒక చిన్న జీవిత సత్యం గుర్తుకు వస్తుంది. మనిషి ఒంటరిగా ఉంటే ‘సున్న’తో సమానం, దేవుడు ‘ఒకటి’తో సమానం. ఆ దేవుడి పక్కన మానవుడు చేరితే అది ‘పది’ అవుతుంది. అది జీవితం. ప్రతి పనినీ భగవంతుడే వెంట ఉండి నడిపిస్తాడు. ‘మనిషి నడుస్తాడు, భగవంతుడు నడిపిస్తాడు...’ అనే విషయాన్నే ఈ పాటలో వెన్నెలకంటిగారు అద్భుతంగా చెప్పారు.
అంధుడికి సూర్యుడు కనిపించడు కనుక, సూర్యుడు లేడంటే కుదరదు, భగవంతుడు కంటికి కనిపించలేదు కదా అని దేవుడు లేడంటే ఎలా కుదురుతుంది? గువ్వపిల్లలు నీటిలో ఈదలేవు, చేపపిల్లలు నింగిలో ఎగరలేవు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అది మీరటం ఎవరి తరమూ కాదు. ఏ జీవికీ మిడిసిపాటు పనికిరాదు. కర్తవ్యం నెరవేర్చాలి, భారం భగవంతుడి మీద వేయాలి, అప్పుడే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు... అనే వేదాంతాన్ని వెన్నెలకంటి ఎంతో హృద్యంగా వివరించారు. ఆయన పాట రాసి ఇచ్చిన తరువాతే ట్యూన్ చేశాను. దర్శకులు సింగీతంగారి అనేక సినిమాలకు సంగీతం సమకూర్చాను. పౌరాణిక చిత్రం ఆయనతో కలిసి చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది.
నడిచేది జీవుడు నడిపేది దేవుడు
Published Sun, May 21 2017 12:08 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement