ఇది హీటర్ లాంటిదే | Immersion circulator | Sakshi
Sakshi News home page

ఇది హీటర్ లాంటిదే

Jul 3 2016 1:01 AM | Updated on Aug 3 2018 2:57 PM

ఇది హీటర్ లాంటిదే - Sakshi

ఇది హీటర్ లాంటిదే

ఇప్పుడంటే గీజర్లు కానీ.. దానికి ముందు మొత్తం ఇమ్మర్షన్ హీటర్లే కదా.. ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబాల్లో వేడినీళ్లు కావాలంటే...

ఇప్పుడంటే గీజర్లు కానీ.. దానికి ముందు మొత్తం ఇమ్మర్షన్ హీటర్లే కదా.. ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబాల్లో వేడినీళ్లు కావాలంటే హీటర్లనే వాడతారు. ఈ ఇమ్మర్షన్ సూత్రంతో వచ్చిందే ఈ ‘ఇమ్మర్షన్ సర్కులేటర్’. లైట్ వెయిట్‌తో కాంపాక్ట్ సైజులో ఉన్న ఈ పరికరం గ్యాస్ అవసరం లేకుండా మీ వంటను త్వరగా, సులువుగా పూర్తి చేస్తుంది. ఎలా అంటే... గుడ్లు, కూరగాయలు లేదా మాంసాన్ని ఉడికించాలంటే, వాటిని నీళ్లు పోసిన గిన్నెలో వేయాలి.

తర్వాత దానికి ఈ ఇమ్మర్షన్ సర్కులేటర్‌ను తగిలించాలి (వీటికి ఉన్న క్లిప్స్‌తో). ఇప్పుడు ఎలక్ట్రిక్ సప్లై ఇస్తే సరిపోతుంది. టెంపరేచర్‌ను కూడా మనం ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. అలాగే సాంబార్, పాలు లాంటివి వేడి చేసుకోవాలన్నా... ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement