సబల | world women's day | Sakshi
Sakshi News home page

సబల

Mar 9 2015 12:07 AM | Updated on Sep 2 2017 10:31 PM

సబల

సబల

మగువంటే పువ్వులా సున్నితమే కాదు... అవసరమైతే రాళ్లను పిండి చేసేంత సబలగానూ అవతారమెత్తగలదు ! నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆదివారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో బాలిక కరాటే విన్యాసం ఇది.

మగువంటే పువ్వులా సున్నితమే కాదు... అవసరమైతే రాళ్లను పిండి చేసేంత సబలగానూ అవతారమెత్తగలదు ! నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆదివారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో బాలిక కరాటే విన్యాసం ఇది. ‘నా రక్షణ.. నా బాధ్యత’పై విమెన్ ఆఫీసర్స్ గ్రూప్1
 తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10కె సైక్లింగ్, 5కె, 3కె రన్ నిర్వహించారు. అడిషనల్ సీపీ (క్రైమ్) స్వాతి లక్రా, జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్ అరుణాబహుగుణతో పాటు  విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 
  కార్యాలయాలు, ఇళ్లు, రోడ్లపై మహిళలకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెబుతూ పోలీస్ అకాడమీ ట్రైనీ ఐపీఎస్‌లు ప్రదర్శించిన స్ట్రీట్ ప్లే ఆకట్టుకుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన రన్... జలవిహార్ మీదుగా తిరిగి పీపుల్స్ ప్లాజాకు చేరుకుంది.
 ఖైరతాబాద్
 

Advertisement
 
Advertisement
Advertisement