కొత్త పరిశోధన | The new research | Sakshi
Sakshi News home page

కొత్త పరిశోధన

Jul 30 2015 11:16 PM | Updated on Sep 3 2017 6:27 AM

కొత్త పరిశోధన

కొత్త పరిశోధన

పగటి నిద్ర పనికి చేటు అని సామెత. పగటి కలలు అనే మాటకు అంత గౌరవం లేదని ఆ ప్రయోగంలోనే తెలుస్తుంది.

పగటి నిద్ర మేలు చేసేదే!
 
పగటి నిద్ర పనికి చేటు అని సామెత. పగటి కలలు అనే మాటకు అంత గౌరవం లేదని ఆ ప్రయోగంలోనే తెలుస్తుంది. కానీ పగటి నిద్ర అంత చెడ్డదేమీ కాదంటున్నారు పరిశోధకులు. రోజూ కనీసం అరగంట పాటు పగటివేళ నిద్రపోయే వారికి చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయట. రాత్రి సరిగా నిద్రపట్టని కారణంగా కలిగే ఆరోగ్యలోపాలను పగటి నిద్ర చాలావరకు రిపేర్ చేస్తుందట. అంతేకాదు... స్థూలకాయం, డయాబెటిస్, హైబీపీ, డిప్రెషన్‌తో బాధపడేవారికి పగటి నిద్ర... వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

పగటినిద్రపోయే వారిలోని మెదడులో ఒత్తిడిని తగ్గించే నార్‌ఎపీనెఫ్రిన్ అనే హార్మోను ఎక్కువగా తయారై అది గుండెజబ్బులనూ, రక్తపోటునూ తగ్గిస్తుంది. ఈ ఫలితాలన్నింటినీ పరిశోధకులు ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement