తాతగారి పచ్చబొట్టు | Tattooing grandfather | Sakshi
Sakshi News home page

తాతగారి పచ్చబొట్టు

Apr 15 2016 12:04 AM | Updated on Sep 3 2017 9:55 PM

తాతగారి పచ్చబొట్టు

తాతగారి పచ్చబొట్టు

పచ్చబొట్లు తాతల కాలం నుంచే ఉన్నాయి కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారా?

తిక్క  లెక్క

పచ్చబొట్లు తాతల కాలం నుంచే ఉన్నాయి కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? కచ్చితంగా ఉంది. పచ్చబొట్టు పొడిపించుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ బ్రిటిష్ తాతయ్య పేరు జాక్ రేనాల్డ్స్. వయసు 104 ఏళ్లు. చెస్టర్‌ఫీల్డ్‌లో ఉంటాడు. ఇన్నాళ్లూ ‘మచ్చ’లేని జీవితం గడిపేసిన ఈ తాతయ్యకు ఉన్నట్టుండి పచ్చబొట్టు పొడిపించుకోవాలనిపించింది.


ఈ వయసులో తట్టుకోలేవంటూ ఎందరు వారించినా వినకుండా, సూదిపోటుకు సిద్ధపడ్డాడు. కోరుకున్న విధంగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతిపెద్ద వయసులో తొలి పచ్చబొట్టు పొడిపించుకున్న వృద్ధుడిగా గిన్నెస్ రికార్డు సొంతం చేసుకున్నాడు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement