సీక్రెట్ ఖర్చులు చేసేది మగాళ్లే.. | Secret costs Mans serving .. | Sakshi
Sakshi News home page

సీక్రెట్ ఖర్చులు చేసేది మగాళ్లే..

Jul 25 2014 10:21 PM | Updated on Sep 2 2017 10:52 AM

చెప్పా పెట్టకుండా...సెలైంటుగా ఖర్చులు చేసేది మహిళలే అంటుంటారు కానీ.. నిజానికి ఆ పని ఎక్కువగా చేసేది మగాళ్లేనట.

చెప్పా పెట్టకుండా...సెలైంటుగా ఖర్చులు చేసేది మహిళలే అంటుంటారు కానీ.. నిజానికి ఆ పని ఎక్కువగా చేసేది మగాళ్లేనట. పెపైచ్చు బోలెడంత డబ్బు తగలేసి కొన్నా వాటిని కనిపించకుండా దాచిపెట్టేయడం, కొన్న విషయం బైటపడకుండా రసీదులు చింపి అవతల పారేయడం లాంటివి చేసి జాగ్రత్తపడతారట.

వోచర్‌క్లౌడ్‌డాట్‌కామ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు బైటపడ్డాయి. షాపింగ్ గురించి, ఏయే ఐటమ్‌లు ఎంతెంత ఖర్చు పెట్టి కొన్నామన్నవి జీవిత భాగస్వామికి చెప్పకుండా గోప్యంగా ఉంచుతామన్న వారిలో మహిళలు 22 శాతమే ఉంటే.. పురుషుల సంఖ్య అంతకు రెట్టింపు ఉంది. చాలా మంది మహిళలు తాము కొన్న వస్తువుకి సంబంధించి ఇంట్లో అసలు రేటు చెప్పకుండా తగ్గించే చెబుతామని వెల్లడించారు.

అలాగే, అప్పుడప్పుడు కొత్తవైనా సరే .. పాతవాటిగా కలరింగ్ ఇస్తుంటామని కూడా చెప్పారు. ఇందుకు మహిళల దగ్గర బలమైన కారణాలే ఉన్నాయి. జీవిత భాగస్వామిని ఆందోళనపర్చడం, వారితో వాదులాటకు దిగడానికి ఇష్టపడకపోవడం అందులో ప్రధాన కారణం.
 

Advertisement
 
Advertisement
Advertisement