ఇయం వార్తా శ్రూయంతాం.... | Malaysia Airlines is the official website | Sakshi
Sakshi News home page

ఇయం వార్తా శ్రూయంతాం....

Jan 27 2015 11:07 PM | Updated on Sep 2 2017 8:21 PM

ఇయం వార్తా శ్రూయంతాం....

ఇయం వార్తా శ్రూయంతాం....

‘చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్’తొలిసారిగా లిబ్బే లేన్ అనే ఫిమేల్ బిషప్‌ను నియమించింది.

ప్రపంచం
 
 ‘చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్’ తొలిసారిగా  లిబ్బే లేన్ అనే  ఫిమేల్ బిషప్‌ను నియమించింది. సంప్రదాయవాదులు మాత్రం ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాను ‘గే’ అని తెలియడంతో యాజమాన్యం తనను ఉద్యోగం నుంచి తీసివేసిందని,  ఇది అన్యాయమైన నిర్ణయమని చైనాలోని నన్‌షాన్ జిల్లా కోర్టులో కేసు ఒకటి దాఖలైంది. ఇలాంటి కేసు  కోర్టులో దాఖలు కావడం ఇదే తొలిసారి. మలేషియా ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌ను ‘సైబర్ కాలిపేట్’ అనే గ్రూపు హ్యాక్ చేసింది.

ఇంగ్లండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి పెద్ద టమోటాను  పండించి  సంచలనం సృష్టించారు. ఈ టమోటో సాధారణ టమోటాల కంటే 12 రెట్లు పెద్దదిగా ఉంటుంది.తూర్పు ఏషియాలో దాదాపు  20 కోట్ల మంది ప్రజలు పల్లెల నుంచి పట్నాలకు వలస వెళ్లినట్లు ‘వరల్డ్ బ్యాంకు’ రిపోర్ట్ చెబుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement