అస్రానీ.... | loud comedy asrani | Sakshi
Sakshi News home page

అస్రానీ....

Sep 6 2015 11:27 PM | Updated on May 28 2018 3:50 PM

అస్రానీ.... - Sakshi

అస్రానీ....

అస్రానీది లౌడ్ కామెడీ. పెద్ద పెద్దగా అరవడం ద్వారా కామెడీ పండించే నటులలో అస్రానీ ఒకడు.

కమెడియన్

అస్రానీది లౌడ్ కామెడీ. పెద్ద పెద్దగా అరవడం ద్వారా కామెడీ పండించే నటులలో అస్రానీ ఒకడు. కాని అతడిలో చాలా మంచి నటుడున్నాడన్న సంగతి హృషికేశ్ ముఖర్జీ కనిపెట్టి ‘గుడ్డీ’, ‘బావర్చీ’, ‘చుప్ కే చుప్ కే’, ‘అభిమాన్’ వంటి సినిమాల్లో చాలా మంచి వేషాలిచ్చాడు. అస్రానీకి ‘షోలే’ ఎంత మేలు చేసిందో అంతే కీడు చేసింది. ఆ సినిమాలో అతడు పోషించిన జైలర్ పాత్రను వదలని ప్రేక్షకుడు అదే మాడ్యులేషన్‌లో అతడి నుంచి కామెడీ ఆశించారు. ఇప్పటికీ ఆ మూసలోనే దర్శకులు చేయిస్తూ ఉన్నారు. అస్రానీ సింధీ కుటుంబానికి చెందినవాడు. విభజన తర్వాత కుటుంబం పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చేసింది.

కార్పెట్లు అమ్మడం, లెక్కలు చూడటం ఇష్టం లేక సినిమాల మీద పడ్డాడు. అమితాబ్, అస్రానీ ఒకే బిల్డింగ్‌లో చెరో రూమ్‌లో ఉండి వేషాలకు ప్రయత్నించేవారు. అస్రానీ హిందీ సినిమాల్లో కామెడీ చేసినా గుజరాతీ సినిమాల్లో హీరోగా రాణించాడు. సినిమాల్లో సంపాదించింది మళ్లీ సినిమాలు తీసి పోగొట్టుకున్నాడు. అయినా సుదీర్ఘకాలంగా కామెడీలో రాణిస్తున్న నటుడిగా గౌరవం పొందుతున్నాడు. మహేశ్‌బాబు తొలి సినిమా ‘రాకుమారుడు’లో అస్రానీ నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement