చిన్ని చిన్ని ఆశ! | Gossip | Sakshi
Sakshi News home page

చిన్ని చిన్ని ఆశ!

Jun 11 2015 11:18 PM | Updated on Sep 3 2017 3:35 AM

చిన్ని చిన్ని ఆశ!

చిన్ని చిన్ని ఆశ!

పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన ‘కహో నా... ప్యార్ హై’ సినిమా సూపర్ డూపర్ హిట్టై హృతిక్ రోషన్,

గాసిప్

పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన  ‘కహో నా... ప్యార్ హై’ సినిమా సూపర్ డూపర్ హిట్టై హృతిక్ రోషన్, అమీషా పటేల్‌లను ప్రేక్షకులకు చేరువ చేసింది. రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ అత్యధిక అవార్డ్‌లు గెలుచుకొని ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కింది. సినిమా మ్యూజిక్ కూడా సూపర్  హిట్ అయింది.

‘కహో నా...ప్యార్ హై’కి  సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయని తాజా కబర్. ఇది ఎంత వరకు నిజమో తెలియదుగానీ ‘‘నేనూ, హృతిక్ కలిసి కహో... నా ప్యార్ హై సీక్వెల్‌లో నటిస్తే మరోసారి రికార్డ్‌లు బ్రేక్ కావడం ఖాయం’’ అంటుంది అమీషా.
 ‘కహో నా... ప్యార్ హై’ సీక్వెల్ వస్తుందా? రాదా? అనేది వేరేసంగతి కాని, ఒకవేళ వస్తే మాత్రం అమీషా పటేల్ హీరోయినయ్యే అవకాశాలు లేవంటున్నారు  సినీ పండితులు. దీనికి కారణం హృతిక్ రోషన్. హీరోగా అతని హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్‌గా మాత్రం అమీషా వెనబడిపోయింది. కాబట్టి ‘కహోనా..’ సీక్వెల్‌లో ఆమెకు ఛాన్స్ రావడం కష్టమే! అనే మాటలు వినబడుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement