ఈ రికార్డు చాలా ‘హాట్’ గురూ..! | Chillies eats Jason MAcDonald knob | Sakshi
Sakshi News home page

ఈ రికార్డు చాలా ‘హాట్’ గురూ..!

Dec 8 2015 1:34 AM | Updated on Aug 21 2018 2:34 PM

ఈ రికార్డు చాలా ‘హాట్’ గురూ..! - Sakshi

ఈ రికార్డు చాలా ‘హాట్’ గురూ..!

ఎంతటి భోజనప్రియులైనా ఏదో కాస్త అభి‘రుచి’ కోసం... రుచుల మీద మమ‘కారం’ కొద్దీ ఒకటో రెండో మిరపకాయలను నమలొచ్చు.

ఎంతటి భోజనప్రియులైనా ఏదో కాస్త అభి‘రుచి’ కోసం... రుచుల మీద మమ‘కారం’ కొద్దీ ఒకటో రెండో మిరపకాయలను నమలొచ్చు. సాదాసీదా మిరపకాయలైతే కాస్త గట్టిపిండాలు ఓ గుప్పెడు వరకు లాగించేస్తారు. కాస్త కొరకగానే మంట నసాళానికెక్కేలా చేసే ‘భూత్ జొళొకియా’ మిరపకాయలను ఎవరైనా ఎన్ని నమలగలరు? ఆ రకం మిరపకాయను ఒక్కటి పూర్తిగా తినడమే మామూలు మానవులకు సాధ్యం కాదు. అలాంటిది జాసన్ మెక్ నాబ్ అనే ఈ అమెరికన్ యువకుడు ఏకంగా 66 గ్రాముల ‘భూత్ జొళొకియా’ మిరపకాయలను రెండు నిమిషాల్లోనే పరపరా నమిలేసి గిన్నెస్‌రికార్డు బద్దలుకొట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement