24, 25 తేదీల్లో జిల్లాలో విజయమ్మ పర్యటన | Municipal election campaign by the road show | Sakshi
Sakshi News home page

24, 25 తేదీల్లో జిల్లాలో విజయమ్మ పర్యటన

Mar 23 2014 2:36 AM | Updated on Oct 16 2018 6:27 PM

24, 25 తేదీల్లో జిల్లాలో విజయమ్మ పర్యటన - Sakshi

24, 25 తేదీల్లో జిల్లాలో విజయమ్మ పర్యటన

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ ఈ నెల 24వ తేదీన జిల్లాకు రానున్నారు.

రోడ్ షో ద్వారా మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ ఈ నెల 24వ తేదీన జిల్లాకు రానున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో రోడ్ షో ద్వారా విజయమ్మ ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

24న ఉదయం 9 గంటలకు విజయమ్మ మధిరకు చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4గంటలకు ఇల్లెందు చే రుకుని ఎన్నికల ప్రచారం చేస్తారు. 25న ఉద యం 8 గంటల నుంచి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సత్తుపల్లి చేరుకుని అక్కడ మున్సిపాలిటీ పరిధిలో రోడ్‌షో నిర్వహిస్తారు. జిల్లాలో  విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలను, అభిమానులను, నాయకులను పాయం వెంకటేశ్వర్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement