టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరో మూడు రోజులు పొడిగిస్తూ సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.
షార్ట్‌హ్యాండ్ పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగింపు
Jan 12 2016 10:55 AM | Updated on Aug 20 2018 3:09 PM
సాక్షి,హైదరాబాద్: టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరో మూడు రోజులు పొడిగిస్తూ సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరిలో జరిగే ఈ పరీక్షలకు ఈనెల 15వ తేది లోగా దరఖాస్తు చేయాలి. రూ.300 అపరాధ రుసుముతో ఈ నెల17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 1400 తత్కాల్ రుసుముతో ఈ నెల19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 20 లోగా ఆలస్యపు రుసుముతో సమర్పించవచ్చని బోర్డు కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement


