రేషన్‌ కార్డుల్లో ఫొటో అప్‌లోడ్‌ చేసుకోండి: డీఎస్ డీఓ | Upload a photo to get ration cards:dsdo | Sakshi
Sakshi News home page

రేషన్‌ కార్డుల్లో ఫొటో అప్‌లోడ్‌ చేసుకోండి: డీఎస్ డీఓ

Jul 28 2016 11:26 PM | Updated on Sep 4 2017 6:46 AM

రేషన్‌ కార్డుకు సంబంధించి కుటుంబ గ్రూప్‌ ఫొటోని అప్‌లోడ్‌ చేయించుకోవాలని లబ్ధిదారులకు డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు సూచించారు.

అనంతపురం అర్బన్‌ : రేషన్‌ కార్డుకు సంబంధించి కుటుంబ గ్రూప్‌ ఫొటోని అప్‌లోడ్‌ చేయించుకోవాలని లబ్ధిదారులకు డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌ కార్డులో గ్రూప్‌ ఫొటో రాని వారు సంబంధిత తహశీల్దారు కా ర్యాలయాలకు వెళ్లి అప్‌లోడ్‌ చేయించుకోవాలని తెలిపారు. అప్‌లోడ్‌ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. చౌక దుకాణాల డీలర్లు తమ షాపులోని రేషన్‌ సరుకులు, స్టాక్‌ వివరాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలని చెప్పారు. తహశీల్దారులు, సీఎస్‌డీటీలు క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించి దుకాణాల్లో వివరాలు ప్రదర్శించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement