వంతెన అంచుపై వేలాడుతున్న లారీ | tire puncture lorry strucks midle of bride in medak | Sakshi
Sakshi News home page

వంతెన అంచుపై వేలాడుతున్న లారీ

Sep 24 2016 12:38 PM | Updated on Sep 4 2017 2:48 PM

వంతెన అంచుపై వేలాడుతున్న లారీ

వంతెన అంచుపై వేలాడుతున్న లారీ

మంజీరా నది పై లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బ్రిడ్జ్ అంచున ఆగిపోయింది.

మెదక్: మంజీరా నది పై లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బ్రిడ్జ్ అంచున ఆగిపోయింది. ఈ సంఘటన మనురు మండలం రాయిపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. బీదర్ వైపు పళ్లలోడుతో మంజీరా నది బ్రిడ్జ్ పై వెళుతుండగా లారీ టైర్ పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి బ్రిడ్జ్ సైడ్ వాల్ను ఢీకొట్టి వాగువైపు దూసుకెళ్లింది.

అదృష్టవశాత్తూ బ్రిడ్జ్ అంచున ఆగిపోయి వేళాడుతోంది. లారీ క్యాబిన్ వాగు వైపు ఉండటంతో లారీ డ్రైవర్, క్లినర్లు చాలా సమయం వరకు లారీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. లారీ బ్యాలెన్స్ తప్పి వాగులో పడిపోకుండా అటు వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement