బైక్ కొనివ్వలేదని.. | The young man committed suicide by hanging | Sakshi
Sakshi News home page

బైక్ కొనివ్వలేదని..

Jun 23 2016 12:53 PM | Updated on Nov 6 2018 7:56 PM

తల్లిదండ్రులు కొత్త బైక్ కొనివ్వకపోవడంతో.. మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

 ఎన్నిసార్లు అడిగినా.. తల్లిదండ్రులు కొత్త బైక్ కొనివ్వకపోవడంతో.. మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం నల్లరాళ్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామిరెడ్డి(21) డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న పాత బైక్ కళాశాలకు తీసుకెళ్లాలంటే నామోషీగా ఉందని.. కొత్త బైక్ కొన్నివ్వాలని గత కొన్ని రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement