గ్యాస్‌ సిలిండర్‌లో నీళ్లు | The water in the cylinder | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌లో నీళ్లు

Jan 2 2017 1:49 AM | Updated on Sep 5 2017 12:08 AM

గ్యాస్‌ సిలిండర్‌లో నీళ్లు

గ్యాస్‌ సిలిండర్‌లో నీళ్లు

సిలిండర్‌లో గ్యాస్‌ ఉండటం లేదు. అయితే సిలిండర్‌ బరువు మాత్రం ఎంత ఉండాలో అంతే ఉంది.

అక్కిరెడ్డిపాలెం: సిలిండర్‌లో గ్యాస్‌ ఉండటం లేదు. అయితే సిలిండర్‌ బరువు మాత్రం ఎంత ఉండాలో అంతే ఉంది. కానీ నెలున్నర రోజులు రావాల్సిన ఇండియన్‌ గ్యాస్‌ సిలిండర్‌ కేవలం 10 రోజులు మాత్రమే వచ్చింది. అనుమానంతో స్థానిక మహిళలు సిలిండర్‌ను కదిపి చూడగా నీళ్లు ఉన్న శబ్ధం రావడంతో సిలిండర్‌ను తిరగేశారు. ఇంకేముంది సిలిండర్‌ హెడ్‌ నుంచి నీళ్లు బయటకు చిందాయి. అక్కిరెడ్డిపాలెంలో ఒక ఇంట్లో చోటు చేసుకున్న ఘటన ఇది.

తమ పేరు చెబితే గ్యాస్‌ పంపిణీలో ఇబ్బందులకు గురిచేస్తారని సంబంధిత బాధితులు వివరాలు వెల్లడించలేదు. ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నాయని స్థానిక మహిళలు తెలిపారు. దీనిపై ఎవ్వరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదని, గ్యాస్‌ సరఫరా చేస్తున్న వారిని అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement