పిల్లల వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు | State seminar | Sakshi
Sakshi News home page

పిల్లల వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు

Oct 5 2016 6:38 PM | Updated on Sep 4 2017 4:17 PM

పిల్లల వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు

పిల్లల వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు

జిల్లా కేంద్రంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు పిల్లల వైద్యుల (పీడియాట్రిక్‌) రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పిల్లల వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నీలి రాంచందర్‌ తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌ : 
జిల్లా కేంద్రంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు పిల్లల వైద్యుల (పీడియాట్రిక్‌) రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పిల్లల వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నీలి రాంచందర్‌ తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పిల్లల వైద్యుల రాష్ట్ర స్థాయి రెండో సదస్సును మెడికల్‌ కళశాలలోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని, సదస్సులో జాతీయ పిల్లల వైద్యల నిపుణులు పాల్గొంటారన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అతిథులుగా అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌గుప్త, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, మేయర్‌ సుజాత పాల్గొంటారన్నారు.విలేకరుల సమావేశంలో డాక్టర్‌ ఆజ్జ శ్రీనివాస్, సత్యకుమారస్వామి, ఆనంద్, దీపక్‌రాథోడ్, విశాల్‌ పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement